Rebel Star: రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ పాటికే విడుదలవ్వాల్సింది కానీ టీజర్లో వీఎఫెక్స్ నాసిరకంగా ఉండటంతో మెరుగుపరిచేందుకు చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్, శ్రీరామనవమికి రిలీజ్ అయిన 30సెకన్ల వీడియో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్.

ఇండియాలో వందకు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ ట్రైలర్, అదే రోజున అమెరికా, సింగపూర్, దుబాయ్, కెనడా, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక వంటి 70దేశాల్లో రిలీజ్ అవనుంది. ఇంత పెద్ద ఎత్తున ట్రయిలర్ లాంచ్ చేసిన తోలి భారతీయ చిత్రంగా ఆదిపురుష్ సినిమా రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఈ నేపథ్యంలో టీజర్లో వీఎఫెక్స్ క్వాలిటీ చూసి ఆందోళన చెందిన డార్లింగ్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించాడు. ప్రభాస్ గత చిత్రం రాధేశ్యామ్ అనుకున్న స్థాయిలో అలరించకపోవటం వల్ల ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఆవనున్న ఈ సినిమా 3డి లో కూడా రూపొందింది. విజువల్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు. ప్రభాస్ పౌరాణిక పాత్రలో నటించటం ఇదే తొలిసారి కాబట్టి ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ నుండి మొదటి పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్ ద్వారా మరో పాన్ ఇండియా హిట్ అందుకొని తన స్థానాన్ని కాపాడుకుంటాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు