Tollywood: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కి మణిరత్నం బ్రేక్ వేశాడా..? 

మహాభారతం ఆధారంగా సినిమా తీయాలన్నది రాజమౌళి డ్రీమ్ అన్న సంగతి తెలిసిందే. ఎప్పటికైనా మహాభారతం మీద సినిమా తీసి తీరుతానని రాజమౌళి కూడా పలు మార్లు స్పష్టం చేశాడు. అయితే, ఆ సినిమా తీయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, భారీ తారాగణం కూడా కావాలి. RRR సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి లాంటి దర్శకుడికి బడ్జెట్, స్టార్ క్యాస్ట్ ని సెట్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు.  అయితే ఇటీవల మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పీఎస్ సినిమా రిజల్ట్ చూస్తే రాజమౌళి పునరాలోచనలో పడే అవకాశం కనిపిస్తోంది. పొన్నియన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన పీఎస్ సినిమా రెండు భాగాలు ఈ తరం ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆ సినిమా కథ పూర్తిగా తమిళ నేటివిటీకి చెందినది కావటం, ఇతర ప్రాంత ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవటం ఆ సినిమాకు మైనస్ అయ్యింది.

పొన్నియన్ సెల్వన్ రిజల్ట్ నుండి రాజమౌళి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పొన్నియన్ సెల్వన్ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సినిమా, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న కథ. చారిత్రాత్మక నేపధ్యానికి, పౌరాణికానికి చాలా తేడా ఉంది. పైగా పొన్నియన్ సెల్వన్ తమిళ నాట మినహా ఏ ప్రాంతంలో ప్రాచుర్యం లేని కథ. మహాభారతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథ కాబట్టి పొన్నియన్ సెల్వన్ తో పోల్చి చూడలేం.

ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేని మణిరత్నం టేకింగ్ కి, RRR లాంటి బ్లాక్ బస్టర్ తో ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాజమౌళి టేకింగ్ కి చాలా తేడా ఉంటుంది కాబట్టి మహాభారతం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పచ్చు. రాజమౌళి మహాభారతం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడతాడా అని తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహాభారతంలోని ఏ ఇతివృత్తం ఆధారంగా రాజమౌళి సినిమా ఉండబోతోంది, అందులో ఎవరెవరు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు వంటి అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి గనక ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే భారతీయ సినీ చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్ గా నిలవటం ఖాయం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు