NTR 30 : పవన్ కళ్యాణ్ టైటిల్ తో

ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తన కెరీర్ లో  30వ సినిమాను కొరటాలతో చేస్తున్నాడు. ఇది బిగ్గెస్ట్ మాస్  ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన మోషన్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేశాయి. దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ చిత్రం కథపై చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. అందువల్లే ఆలస్యం అయిందని టాక్. ఇదిలా ఉండగా, ఇటీవలే దర్శకుడు కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసినట్టు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

తాజాగా ఎన్టీఆర్ 30 సినిమాకి దేవర అనే టైటిల్ ని దర్శకుడు కొరటాల ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే దేవర అనే  టైటిట్ ని పవన్ కళ్యాణ్ కోసం నిర్మాత బండ్ల గణేష్ రిజిస్ట్రేషన్ చేయించారట. కానీ బండ్ల గణేష్ ఈ టైటిల్ ని మళ్లీ రెన్యువల్ చేయకపోవడంతో కొరటాల శివ ఇదే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ 30కి దేవర అనే టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొని వచ్చే ఏడాది దసరా నాటికి విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు