Nani’s Next : మళ్ళీ పీరియాడిక్ లవ్ స్టోరీ… ఈసారైనా వర్కౌట్ అవుతుందా?

Nani’s Next : నేచురల్ స్టార్ నాని విలక్షణమైన పాత్రలతో, సరికొత్త కథలతో టాలీవుడ్ ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఒకే ఒక్క మిడ్ రేంజ్ హీరో నానినే. “దసరా” వంటి బ్లాక్ బస్టర్ మాస్ మూవీతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు నేచురల్ స్టార్. ఆ తర్వాత “యానిమల్” లాంటి వైలెన్స్ మూవీ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్న సమయంలో “హాయ్ నాన్న” అంటూ సున్నితమైన కథతో అందరినీ తన వైపుకు తిప్పేసుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ కం కమెడియన్ వేణుతో నాని చేయబోతున్న మూవీ ఏ జానర్ లో ఉండబోతోంది అన్న విషయం తాజాగా రివీల్ అయింది.

“బలగం” డైరెక్టర్ వేణుతో నాని నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల వేణుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నాని చర్చలు జరపగా, ఫైనల్ నేరేషన్ జరిగిందని సమాచారం. ఈ యంగ్ కమెడియన్ స్టోరీతో నాని ఫుల్ ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ, ఈ మూవీ జానర్ ఏంటన్న విషయం బయటకు వచ్చింది. వేణు దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న ఈ మూవీ తెలంగాణ పల్లెటూరులో జరిగే పీరియాడిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి అధికారికంగా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ కోసం వేట సాగుతుందని తెలుస్తోంది. అయితే నాని పిరియాడిక్ లవ్ స్టోరీ లో నటించడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో “శ్యామ్ సింగ రాయ్” అనే సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. అందులో నాని, సాయి పల్లవి మధ్య నడిచే స్టోరీ అంతా పీరియాడిక్ లవ్ స్టోరీనే. అయితే ఆ సినిమా నానికి ఆశించడం విజయాన్ని అందించలేకపోయింది. అయినప్పటికీ మరోసారి నేచురల్ స్టార్ పీరియాడిక్ లవ్ స్టోరీని చేయడానికి రెడీ అయ్యారు. అయితే శ్యామ్ సింగ రాయ్ స్టోరీ బెంగాల్ నేపథ్యంలో ఉండగా, వేణు మూవీ అంతా తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఈసారి నానికి పీరియడ్ లవ్ స్టోరీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక ప్రస్తుతం నాని చేస్తున్న కొత్త సినిమా “సరిపోదా శనివారం” షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో “అంటే సుందరానికి” అనే సినిమా వచ్చింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. మే నెలలో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత వేణు, నాని కాంబో పట్టాలెక్కనుందని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు