Lifestyle: 9 టు 5 జాబ్ బోర్ కొట్టిందా? ఈ టిప్స్ తో ఆ టెన్షన్ నుంచి ఎస్కేప్ అవ్వండి

Lifestyle:  9 టూ 5 జాబ్ అంటే నేటితరం యూత్ చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఇలా రోజంతా ఆఫీస్ కే పరిమితం అయిపోయి, ఆ తర్వాత ట్రాఫిక్ సమస్యలను దాటుకుని, ఇంటికి వెళ్లేసరికి ప్రాణం ఉస్సూరుమంటుంది. కానీ జాబ్ చేయకపోతే అది ఇంకో బాధ. రెంట్, కరెంట్ బిల్, తిండి కష్టాలు చెప్పనలవి కాదు. ఇక ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే జాబ్ కచ్చితంగా చేయాల్సిందే. ఇలా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కక్కలేము మింగలేము అన్నట్టుగా ఉంటుంది. మరి ఈ టార్చర్ ను తప్పించుకుని వ్యక్తిగత స్వేచ్ఛను పొందాలంటే, అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. 9 టూ 5 జాబ్ కు బైబై చెప్పేసి, హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సులను పెంచుకోవడం

Lifestyle: Bored of 9 to 5 job? Escape from that tension with these tips
9-5 జాబ్ టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి వేయాల్సిన మొదటి అడుగు బహుళ ఆదాయం మార్గాలను నిర్మించుకోవడం. ఈ విధానం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, ఆర్థికంగా నష్టపోతామేమో అని భయపడకుండా కొత్త అవకాశాలను అన్వేషించగలుగుతారు. ఇన్కమ్ డైవర్సిఫికేషన్… అంటే పెట్టుబడులు, హాస్టల్స్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ వంటివి చేయడం. ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే డబ్బులు అన్ని ఒకేచోట పెట్టడం సరైన పద్ధతి కాదు. వివిధ రకాల పెట్టుబడులు పెడితే ఎదురు దెబ్బలు తగిలినా, నష్టం వాటిల్లినా ఆర్థికంగా స్ట్రాంగ్ గానే ఉంటారు.

- Advertisement -

2. పొదుపు

Lifestyle: Bored of 9 to 5 job? Escape from that tension with these tips
ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవాలంటే చేసుకోవాల్సిన మరో కీలకమైన అలవాటు పొదుపు పాటించడం. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ ఆదాయంలో సగ భాగాన్ని పొదుపు చేసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల ఫ్యూచర్లో ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే డబ్బు కూడా ఆదా అవుతూ ఉంటుంది.

3. పెట్టుబడి

Lifestyle: Bored of 9 to 5 job? Escape from that tension with these tips
సంపదను పెంచుకోవడానికి అత్యంత శక్తివంతమైన మార్గాల్లో పెట్టుబడి ఒకటి. ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీ డబ్బు అంతా ఎక్కువగా పెరుగుతుంది. ఇన్స్టంట్ పెట్టుబడులకంటే, దీర్ఘకాలిక పెట్టుబడులు అధిక లాభాలను ఇస్తాయి.

4. స్కిల్స్ పెంచుకోవడం

Lifestyle: Bored of 9 to 5 job? Escape from that tension with these tips
ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ అనేది గేమ్ చేంజర్ గా మారింది. బ్లాగింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా డబ్బులు సంపాదించే చాలా మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ కమ్యూనిటీని సృష్టించడం, పెంపొందించడం వివిధ మానిటైజేషన్ అవకాశాలను అందిస్తుంది. ఫలితంగా ఇంట్లోనే చేస్తూ డబ్బును సంపాదించవచ్చు. ఈ అలవాట్లను ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే అంత త్వరగా ఫైనాన్షియల్ గా నిలదొక్కుకుని, 9-5 జాబ్ కి హ్యాపీగా గుడ్ బై చెప్పేయొచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు