Saripodhaa Sanivaaram : “సరిపోదా శనివారం” రిలీజ్ డేట్ ఫిక్స్… “పుష్ప 2” పోస్ట్ పోన్ కావడమే ఆలస్యం

Saripodhaa Sanivaaram

గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఒకే ఒక్క మిడ్ రేంజ్ హీరోగా రికార్డును క్రియేట్ చేశాడు నాని. ప్రస్తుతం ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్న నెక్స్ట్ మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15న నాని కొత్త చిత్రం “సరిపోదా శనివారం”ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో “అంటే సుందరానికి” అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ డైరెక్టర్ వివేక్ కు నాని మరో ఛాన్స్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపైనే అందరి దృష్టి ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. ఎస్జే సూర్య ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు.

ఇంకా 30% షూటింగ్ కూడా పూర్తి కాని ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం యమ జోరుగా సాగుతోంది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను నైజాంతో పాటు ఆంధ్రాకు గాను భారీ మొత్తానికి దిల్ రాజు సొంతం చేసుకున్నారని సమాచారం. అలాగే ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటిటి రైట్స్ ను దక్కించుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ గురించి వార్తలు స్టార్ట్ అయ్యాయి.

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్ కొన్ని అవాంతరాల కారణంగా ఇంకా పూర్తి కాలేదని, ఈ మూవీ అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం లేదని రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. “పుష్ప 2″ను మేకర్స్ ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నాని బన్నీ మూవీ రిలీజ్ డేట్ పై కన్నేశాడు. ఒకవేళ రూమర్స్ ప్రకారం “పుష్ప 2” వాయిదా పడితే, అదే రోజున అంటే ఆగస్ట్ 15న నాని “సరిపోదా శనివారం” సినిమాతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే వాయిదా పడుతుందన్న రూమర్స్ నేపథ్యంలో “పుష్ప 2” నిర్మాతలు 200 రోజులు కౌంట్ డౌన్ అంటూ తాజాగా పోస్టర్ ను వదిలిన విషయం తెలిసిందే. కానీ సినీ వర్గాల్లో మాత్రం “పుష్ప 2” పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు ఆగడం లేదు. ఒకవేళ ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉన్నా గానీ, అదే తేదీని తన “సరిపోదా శనివారం” సినిమాకు వాడుకోవాలి అనుకుంటున్నాడు నాని. మరి “పుష్ప 2” అందరూ అనుకున్నట్టుగా వాయిదా పడుతుందా? “సరిపోదా శనివారం” ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు