Nagarjuna: మెగాస్టార్ డైరెక్టర్‌తో మల్టీస్టారర్..

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు ప్రస్తుతం అదృష్టం కలిసిరావడంలేదు. ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. ఊపిరి తర్వాత నాగ్ కు చెప్పుకొదగ్గ హిట్ రాలేదు. గతేడాది సంక్రాంతికి విడుదలైన బంగర్రాజు కొంత వరకు ఉపశమనం ఇచ్చినా తర్వాత వచ్చిన గోస్ట్ సినిమా మళ్లీ ఘోరపరాజయం పాలైంది. దీంతో మరోసారి అక్కినేని అభిమానులకు నిరాశతప్పలేదు.

గోస్ట్ ఫెయిల్ తర్వాత నాగార్జున కొంత విరామం తీసుకుంటున్నాడు. ఈ గ్యాప్ లో తన 100వ సినిమాకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. తన కెరీర్ లో వచ్చే 100వ సినిమాను నాగార్జున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాతో నాగార్జున పవరుఫుల్ గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎంచుకునే కథ, డైరెక్టర్ తో పాటు సినిమాలో ఉండాల్సిన నటీనటుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.

తన 100వ సినిమాను ముందుగా ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, కొత్త దర్శకుడి చేతిలో సినిమా పెట్టడం ఇష్టం లేక అనుభవం ఉన్న దర్శకుడితో 100వ చిత్రం చేయాలని నాగ్ నిర్ణయం తీసుకున్నాడట. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ హిట్ ఇచ్చిన మోహన్ రాజాతో నాగ్ చర్చలు జరిపినట్టు సమాచారం అందుతుంది.

- Advertisement -

మోహన్ రాజా చెప్పిన కథ నాగార్జునకు కూడా నచ్చిందని, వెంటనే నాగ్ ఓకే చేశాడని సమాచారం. దీనిలో నాగార్జునతో పాటు అఖిల్ కూడా కనిపించబోతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు