Kajal Aggarwal: పాఠాలు చెప్పబోతుంది..

పెళ్లి చేసుకుని, పిల్లల తల్లులైన తర్వాత కూడా హీరోయిన్ గా కొనసాగడం బాలీవుడ్ లో సాధారణ విషయమే. ప్రేక్షకులు కూడా వీరికి బ్రహ్మరథం పడుతుంటారు. కరీనాకపూర్, ఆలియా భట్ చాలా మంది హీరోయిన్లు ఈ కోవలోకే వస్తారు. అయితే దక్షిణాదికి వచ్చేసరికి సీన్ మరోలా ఉంటుంది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లకు సౌత్ లో అంత క్రేజ్ ఉండదు. పెళ్లి తర్వాత వారికి హీరోయిన్లుగా ద్వారాలు మూసుకుపోయినట్టే.

అయితే దక్షిణాదిన కూడా ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత ఆగ్ర హీరోయిన్ గా కొనసాగింది. మరోవైపు కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత రెండేళ్లుగా ఆమె సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆమె రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా, అజిత్ హీరోగా నటిస్తున్న AK62వ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ఎంపికైనట్టు తాజా సమాచారం. ఇందులో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించనున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండేది.

- Advertisement -

అయితే స్క్రిప్ట్ విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలతో దర్శకుడిని మార్చారట. ఇప్పుడు అదే ప్రాజెక్టును మగిజ్ తిరుమేని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. కాగా ప్రస్తుతం కాజల్ ఖాతాలో తమిళంలో ‘కరంగాపియమ్’, ‘గోష్టి’, హిందీలో ‘ఉమా’ అనే చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు NBK108, ఇండియన్ 2 వంటి సినిమాల్లో కూడా ఈమెకు అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు