Rakul Preet: డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన మరో హీరోయిన్..

కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓటీటీ. సినిమా కోసం థియేటర్ కి వెళ్లి.. అధికంగా ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుండి హాయ్ గా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. దీన్నే దర్శక నిర్మాతలు క్యాచ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. ఓటీటీ లవర్స్ ను కట్టిపడేసేలా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ.. విజయాలను అందుకుంటున్నారు.

దర్శకలే కాదు.. హీరోలు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వెబ్ సిరీస్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తమ నటనను నిరూపించుకున్నారు. తాజాగా ఈ బాటలో హీరోయిన్లు వెళ్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లతో వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ వెబ్ సిరీస్ ల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ల లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంటుంది.

ఇటీవల ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో రాశీ ఖన్నా నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఫలితం ఎలా ఉన్నా.. రాశీ ఖన్నా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా, మరో హీరోయిన్ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ తో పాటు సౌత్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ఇటీవల బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. గతేడాది బాలీవుడ్ లో రకుల్ ఐదు సినిమాలు చేసింది.

- Advertisement -

కానీ, ఈమెకు బాలీవుడ్ లో మంచి సక్సెస్ రావడం లేదు. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్న ఓటీటీలకు మొగ్గుచూపుతుంది. ఇటీవలే కథ, పాత్ర నచ్చితే, వెబ్ సిరీస్ లు చేయడానిక సిద్ధంగా ఉంటానని ప్రకటించిన రకుల్.. తాజాగా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాను తెరకెక్కించిన కాశ్వీ నాయర్ దర్శకత్వంలో తాజాగా ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. ఈ వెబ్ సిరీస్ లో రకుల్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.

రకుల్ ప్రీత్ తన తొలి వెబ్ సిరీస్ లో పోలీస్ పాత్రతో పాటు, వ్యభిచారం చేసే గ్యాంగ్ కి లీడర్ గా కనిపించబోతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కాస్త ఎక్కువగానే బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచే బోల్డ్ సీన్స్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే చాలా హిందీ సినిమాల్లో అలాంటి సీన్స్ లో కనిపించి మెప్పించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ సన్నివేశాల్లో నటించనుంది. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోయే ఈ వెబ్ సిరీస్.. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ను మలుపుతిప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు