Naga Chaitanya: చైతూ జాతకంలో గండం…అందుకే సమంతను వదిలేశాడా ?

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెడితే… మరికొంతమంది హీరోలు ఎంతో కష్టపడి పైకి వస్తున్నారు. అయితే అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని… అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన తండ్రి వారసత్వాన్ని వినియోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య ( Naga Chaitanya ) ఆ తర్వాత తన కాళ్ళ పై తాను నిలబడ్డాడు.

ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాగ చైతన్య. తన కెరీర్ ప్రారంభంలో జోష్ అనే సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత 100% లవ్, మజిలీ లాంటి ప్రేమ కథ సినిమాలతో బంపర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య.

అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలో హీరోయిన్ సమంతతో ప్రేమలో పడిపోయాడు అక్కినేని నాగచైతన్య. అక్కడి నుంచి అక్కినేని నాగచైతన్య కెరీర్ పూర్తిగా మారిపోయింది. హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న నాగచైతన్య… దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాపురం చేశాడు. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత వివాహం జరిగింది. 2021 సంవత్సరంలో వీరిద్దరూ విడిపోయారు.

- Advertisement -

అయితే అక్కినేని నాగచైతన్య జాతకంలో పెద్ద గండం ఉందట. ఆ గండం కారణంగా…. సమంత వివాహం విడాకుల వరకు వచ్చిందట. ఆమెతో పెళ్లి సమయంలో ఈ విషయాన్ని అక్కినేని నాగచైతన్యకు చెప్పారట. దానికోసం ప్రత్యేకంగా పూజలు చేయాలని సూచనలు చేశారట జ్యోతిష్యులు. కానీ అక్కినేని నాగచైతన్య వీటన్నిటిని నమ్మలేదట. తన చివరికి విడాకులు అయి పోయాయి. ఇక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే అదే పరిస్థితి నెలకొంటుందని ఈ మధ్యకాలంలో జ్యోతిష్యులు మరోసారి హెచ్చరించారట. దీంతో ఇప్పుడు అక్కినేని నాగచైతన్య వారి మాట వింటూ… రెండవ వివాహం చేసుకోవడం లేదని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు