Mrunal thakur: తనతో అంత వీజీ కాదంటున్న సీత…!

సీతారామం సినిమాతో తెలుగులో మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో అందరిని అబ్బుర పరిచిన తార మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో హృతిక్ తో సినిమా చేసినప్పటికీ, తెలుగులో సీతారామం ఇచ్చిన గుర్తింపునకు ఫిదా అయిన మృణాల్ ఇక టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయినట్లుంది. నాని 30వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బాలీవుడ్ భామ స్టోరీ సెలెక్షన్ విషయంలో భలే చూజీగా ఉంటోందని టాక్ వినిపిస్తోంది. తనకు పాత్రకు కథలో తగిన ప్రాధాన్యం ఉంటేనే తప్ప ఒప్పుకోవటం లేదట. ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమాలో అఫర్ వచ్చినప్పటికీ తన పాత్రకు తగిన ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేయటమే ఇందుకు నిదర్శనం.

స్టోరీ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఒక రకంగా మంచిదే అయినప్పట్టికీ మరీ ఇలా కెరీర్ ఆరంభంలోనే కేవలం ఒక్కటంటే ఒక్క హిట్ అందుకున్నంత మాత్రాన ఇంత బెట్టు చూపించటం తనకు లాంగ్ రన్ లో మంచిది కాదన్నది ఫిలిం సర్కిల్స్ లో పలువురి అభిప్రాయం. హీరోయిన్లు చాలా మంది స్టోరీ సెలెక్షన్ విషయంలో ఇలా చూజీగా ఉన్నవారు లేకపోలేదు. అయితే కెరీర్ మొదటి నుండి ఉన్నవారు చాలా అరుదు.

గ్లామర్ తో పాటు తమకున్న కొద్దీ స్పేస్ లోనే తమ ప్రతిభ చూపించాలి గాని, ఇలా ప్రతి సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావాలని పట్టు పట్టి కూర్చుంటే స్టార్ హీరోయిన్ గా ఎదగటం కష్టమే. అయితే నాని తో నటించనున్న సినిమా కూడా హిట్ కొడితే, ఇప్పటికే బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న మృణాల్ తెలుగులో తిరుగు ఉండకపోవచ్చు. అయితే నాని సినిమా ఏ మాత్రం కాస్త అటు, ఇటు అయినా కూడా స్టార్ హీరో సినిమా ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేస్తున్న ఈ అమ్మడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు