Nani : ఇక మీద నాని జాగ్రత్తగా ఉండాల్సిందే..!

నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం దసరా హిట్ అయిన ఆనందంలో ఉన్నాడు.  ఇన్నాళ్లు టైర్ 2 హీరో స్థాయి కలెక్షన్స్ కె పరిమితం అయిన నాని దసరా మొదటి రోజు సాధించిన 35కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచాడు, ఇక రెండో రోజు ఏకంగా 53కోట్ల గ్రాస్ తో టైర్ 1 హీరో స్థాయికి చేరుకున్నాడు. ఒక డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం పట్ల నానిపై అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు సినీ క్రిటిక్స్ ప్రశంశల వర్షం కురిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, నాణానికి మరో వైపు అన్నట్టు నాని ఇకపై తీయబోయే సినిమాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అన్న అభిప్రాయాలూ కూడా వెలువడుతున్నాయి. ఇదివరకు నాని తన మార్కెట్, సినిమా బడ్జెట్ వంటి అంశాల కంటే కథలో వైవిద్యం పైనే ఎక్కువ దృష్టి పెడుతూ వచ్చాడు. నాని తరువాతి చిత్రాల విషయంలో కథ మాత్రమే కాకుండా బడ్జెట్ తదితర అంశాల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం దసరా తీసుకొచ్చింది.
దసరా ముందు వరకు తన లుక్స్ విషయంలో కూడా నాని పెద్దగా దృష్టి పెట్టలేదు ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు మినహా. అయితే నాని ఇంతవరకు తన కంఫర్ట్ జోన్ క్లాస్ స్టోరీస్ దాటి మాస్ స్టోరీ ఎంచుకున్న ప్రతిసారి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కున్నాడు. పూర్తీగా కాకపోయినా కొంతవరకు మాస్ షేడ్ ఉన్న శ్యామ్ సింగరాయ్ ఒక్కటీ ఇందుకు మినహాయింపు. లుక్స్ మొదలుకొని స్టోరీ వరకు తన జోన్ విభిన్నంగా తీసిన దసరా హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో ఇకపై నాని తన పంధాని మార్చుకొని మాస్ సినిమాలవైపే అడుగేస్తాడా లేదా?, డెబ్యూ డైరెక్టర్ తో చేసిన ప్రయోగం క్లిక్ అయ్యింది గనుక ఇక మీదట మరింత మంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తాడా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా నాని మాత్రం ఇక మీదట తీయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది స్పష్టం అవుతోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు