RRR Oscar: తారక్ చరణ్ ల మధ్య క్లాష్ కు కారణం ఆ సినిమానేనా…?

సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మస్తిష్కం నుండి పుట్టిన అంతర్జాతీయ సంచలనం RRR క్రియేట్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించటంతో ఇండియన్ సినిమా ప్రైడ్ గా నిలిచింది ఈ సినిమా, దీంతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు వచ్చినట్టైంది. ఇదిలా ఉంటే ఈ ఆస్కార్ వేడుక మరొక వివాదానికి తావిచ్చినట్టు తెలుస్తోంది. ఆస్కార్ వేడుక నుండి తిరిగొచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఇటీవల తన పుట్టినరోజు సందర్బంగా తన స్నేహితులు అందరికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు, అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి హాజరు కాకపోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ ఇచ్చిన పార్టీకి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదట, ఆస్కార్ వేడుక పూర్తవక ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కు బయల్దేరి రావటం రామ్ చరణ్ కు నచ్చకపోవడంతో తన బర్త్ డే పార్టీకి పిలవలేదని టాక్ వినిపిస్తోంది. RRR ప్రమోషన్స్ సమయంలో తారక్ చరణ్ ల ఫ్రెండ్షిప్ గురించి మనం చాలా కథలే విన్నాం, అయితే తాజాగా నెలకొన్న వివాదంతో అవి ప్రశ్నార్థకంగా మారాయి. ఈ క్రమంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి, తారక్ చరణ్ ల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ కొత్తేమి కాదు.

RRR సినిమా రిలీజ్ అయినప్పటి నుండి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇరువురి ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, తారక్ విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ కోసమే హుటా హుటిన బయల్దేరి హైదరాబాద్ కి వచ్చారట. దీంతో ఇద్దరు మంచి స్నేహితుల మధ్య దాస్ కా ధమ్కీ సినిమా క్లాష్ కు కారణం  కారణం అయినట్టయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు