MR Bachchan: ఇలా అనౌన్స్ చేసారో లేదో.. అప్పుడే మొదలెట్టేసారు..

మాస్ మహారాజ్ రవితేజ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా వస్తుందన్న వార్త చాలా రోజులుగా వైరల్ అయిందన్న విషయం తెలిసిందే. అయితే హరీష్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోవడంతో ఈ ఖాళీ అయిన హరీష్ వెంటనే మాస్ మహారాజ్ తో కథ ని ఒకే చేయించుకుని ‘పీపుల్స్ మీడియా బ్యానర్’ తో డీల్ కుదుర్చుకుని మూవీ కూడా అనౌన్స్ చేసేసారు. ఇక రవితేజ హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా హీరో కాబట్టి, ఆ చనువుతో పని ఈజీ అయిందనోచ్చు.

అయితే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన షాక్ నిరాశ పరిచినా, రెండో సినిమాగా వచ్చిన మిరపకాయ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. హరీష్ శంకర్ స్టైల్ లోనే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయ్యి రెండు వారాలు కూడా కాలేదు. అప్పుడే సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది.

మిస్టర్ బచ్చన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో లింగంపల్లి ఏరియాలో ఉన్న BHEL ప్రాంతంలో ఈరోజు నుండే ఒక సాలిడ్ యాక్షన్ పార్ట్ తో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసారు మేకర్స్. బహుశా ఈ యాక్షన్ సీక్వెన్స్ లోనే మూవీ లో రవితేజ ఇంట్రడక్షన్ సీన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయి టాలీవుడ్ కి పరిచయమవుతుంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2024 లో సెకండాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు