TFI Stars in Lungi : లుంగీలో టాలీవుడ్ హీరోలు… ఆ కిక్కే వేరప్పా

టాలీవుడ్ లో ఇప్పుడు లుంగీ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు అంతా లుంగీ కట్టి కనిపించడం అభిమానులను థ్రిల్ చేస్తోంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, ఎప్పుడో మొదలైంది. అంతేకాకుండా హీరో లుంగీ కట్టాడు అంటే ఆ మూవీ హిట్ ఖాయం అనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పటిదాకా లుంగీలో కనిపించిన టాలీవుడ్ యంగ్ హీరోలు ఎవరు? వాళ్ల సినిమాలకు లుంగీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయ్యింది? అనే విషయంలోకి వెళ్తే…

గతంలోకి తొంగి చూస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ “సింహాద్రి” మూవీలో లుంగీతో కనిపించాడు. ఈ మూవీ అప్పట్లో నందమూరి అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా తారక్ కెరీర్ లోనే మరిచిపోలేని మైలురాయిగా మిగిలింది “సింహాద్రి” మూవీ. ఇక నందమూరి ముఖ్యంగా తారక్ అభిమానులకు ఇది ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత తారక్ ఎప్పుడూ లుంగీలో కనిపించలేదు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లుంగీలో కనిపించి అభిమానులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” మూవీకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. చెవిటి వాడిగా రామ్ చరణ్ తన పాత్రలో జీవించేసాడు. ఇక “రంగస్థలం” మూవీలో చెర్రీ లుంగీ కట్టి కనిపించాడు.

- Advertisement -

రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. “భీమ్లా నాయక్” మూవీలో పవన్ కళ్యాణ్ లుంగీలో కనిపించిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన పవన్ లుంగీ పోస్టర్స్ దుమ్మురేపాయి. అలాగే లుంగీ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ మూవీ కూడా హిట్టే.

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన అభిమానులకు ఆ లోటును తీర్చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ నుంచి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో మహేష్ లుంగీలో కనిపించి తన ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇచ్చాడు. మహేష్ బాబును లుంగీలో చూసిన అభిమానులు “గుంటూరు కారం” మూవీ హిట్ అవ్వడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక లుంగీ సెంటిమెంట్ ను బట్టి చూస్తే ఈ మూవీ కూడా హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు