Tamannaah : పెళ్లి పీటలపైకి మరో బ్యూటీ

హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హన్సికా తన పెళ్లి అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు కూడా వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్ తమన్నా అంటే తెలియని వారు ఉండరు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకొని చాలా రోజుల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగింది. తెలుగులో దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే గతకొన్ని రోజుల నుంచి ఈ మిల్కీ బ్యూటికి లక్ కలిసి రావడం లేదు. పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈమె ఇటీవల ఐటెం సాంగ్స్, విలన్ పాత్రలు కూడా చేసింది. అయినా ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు.

అయితే ప్రస్తుతం ఈమెకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సత్యదేవ్ తో గుర్తుందా సీతాకాలంతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ లో నటిస్తుంది. సత్యదేవ్ తో చేసిన గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజుల అవుతున్నా ఇప్పటికీ విడుదల కాలేదు. వీటితో పాటు హిందీలో బెలే చుడియాన్, మలయాళంలో బాంద్రా చిత్రాల్లో నటిస్తుంది. తమన్నా సినిమాల గురించి పక్కన పెడితే, ఆమె వ్యక్తిగత విషయం ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆవార్త ఏంటంటే. తమన్నాపెళ్లి చేసుకోబోతుందట.

తమన్నా పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కోలీవుడ్ కి చెందిన ఒక నటుడితో తమన్నా పెళ్లి జరగబోతుందని కూడా ఒక వార్త వచ్చింది. అయితే ఈ సారి మాత్రం వస్తున్న వార్తల్లో ఒక బిజినెస్ మెన్ పేరు వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మెన్ ను మిల్కీ మ్యూటీ పెళ్లి చేసుకోబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై తమన్నా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేబోతుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు