Mehreen Marriage: ఆ డైరెక్టర్ వల్లే మెహరీన్ పెళ్లి చెడిపోయిందా..?

టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మెహరీన్ ఫిర్జాదా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమా హిట్ అవ్వగానే రెండో సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫీలౌరీ (Phillauri) అనే సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది.

ఆ తరువాత తెలుగులో వరుసగా ఛాన్స్‌లు అందుకోవడమే కాదు, హిట్స్ కూడా కొట్టింది. ఈ విషయాలను పక్కనపెడితే.. మెహరీన్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య భిష్నోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లిదాకా వచ్చాక విడిపోయారు. వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినప్పుడు చాలానే కారణాలు తెరమీదకు వినిపించాయి. ఇక అందులో ఒకటే యంగ్ డైరెక్టర్ తో మెహరీన్ ఎఫైర్ నడపడం. ఆ దర్శకుడు మరెవరో కాదు అనిల్ రావిపూడి. ఎఫ్2 మూవీ నుండి అనిల్ రావిపూడితో మెహరీన్ సన్నిహితంగా ఉండేదట.

అదే సమయంలో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిని పట్టించుకోని మెహరీన్ – అనిల్ ఇద్దరూ సినిమాలలో బిజీ అయిపోయారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయాలని మెహరీన్ కి కండిషన్ పెట్టారట. దానికి ఓకే చెప్పిన మెహరీన్.. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత సమయం ఉండడంతో ధనుష్ మూవీ ఛాన్స్ వస్తే నటించిందట.

- Advertisement -

ఎంగేజ్మెంట్ తర్వాత సినిమాలు చేయడంపై భవ్య బిష్ణోయ్‌కి మెహరీన్ కి మధ్య గొడవలు జరిగాయని, వీరిద్దరి పెళ్లి ఆగిపోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు