Bigg Boss Season7: శివాజీ కూడా పార్షియాలిటీ చుపిస్తున్నాడా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్లో చాలా చేంజెస్ చేయటంతో ఫస్ట్ వీక్ షో ఆసక్తిగా మారింది. ఈ సారి కంటెస్టెంట్స్ హౌస్ మెట్ అర్హత సాధించాలంటే బిగ్ బాస్ పెట్టే పవర్ అస్త్ర టాస్క్ లో విన్ అవ్వాల్సి ఉంటుంది. పవర్ అస్త్ర టాస్క్ కూడా ప్రతివారం ఆసక్తిగా సాగుతోంది.
హౌస్ లో గౌతం లాంటి కంటెస్టెంట్స్ ఇండివిడ్యువల్ ఆడుతుండగా, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యి ఆడుతున్నారు. శివాజీ అయితే యావర్, ప్రశాంత్ లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మొదటి నుండి న్యూట్రల్ గా ఉన్నాడన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసిన శివాజీ మెల్లిగా పార్షియల్ గా ఆడుతున్నాడు.
బుధవారం ఎపిసోడ్లో ప్రశాంత్ విషయంలో యావర్ తప్పు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు శివాజీ. ప్రశాంత్ అంటే యావర్ కి నచ్చడని కామెంట్ చేశాడు. ఆ తర్వాత మరో టాస్క్ రెండు టీమ్స్ మధ్య పెట్టింది బిగ్ బాస్ టీమ్. ఈ టాస్క్ లో అమర్ దీప్ టీమ్ చేసిన తప్పును సంచాలక్ గా ఉన్న సందీప్ సమర్దించగా శివాజీ కూడా లైట్ తీసుకున్నాడు.
అమర్ దీప్ టీమ్ టాస్క్ లో చేసిన తప్పు వల్లే గెలవగా చిన్న తేడా వల్ల ప్రశాంత్ టీమ్ ఓడిపోయింది. దీన్ని బట్టి చూస్తే శివాజీ కూడా మెల్లిగా పార్షియల్ గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. ఈ టాపిక్ మీద వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున శివాజీ, సందీప్ లకు వార్నింగ్ ఇవ్వటం ఖాయమని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వీక్ లో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా ఆసక్తిగా మారింది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు