Tej: క్రేజీ మైల్ స్టోన్ దిశగా మెగా మేనల్లుడు..! 

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు కాంబినేషన్లో విరూపాక్ష సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకి ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రేకివెన్ స్టేజ్ కి చేరుకున్న ఈ సినిమా యుఎస్ లో 1మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం 62.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 100కోట్ల మార్క్ దిశగా అడుగులేస్తోంది. ఇవాళ విడుదలైన ఏజెంట్, పీఎస్2 సినిమాలకు మిశ్రమ స్పందన వస్తుండటంతో విరూపాక్ష కి 100కోట్ల మార్క్ చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదని అనిపిస్తోంది.

మూఢ నమ్మకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో తేజ్ సంయుక్తల నటనకు మంచి ప్రశంసలు అందాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో సంయుక్త నటన సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ క్రమంలో నిఖిల్, నాని లాంటి టైర్2 హీరోలు పాన్ ఇండియా హిట్స్ అందుకొని 100కోట్ల కలెక్షన్స్ సాధించి టైర్ 1హీరోల లిస్ట్ లో చేరగా తేజ్ కూడా త్వరలోనే ఆ లిస్ట్ చేరే అవకాశం కనిపిస్తోంది.

యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత తేజ్ నుండి వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒకరకంగా ఏజెంట్, పీఎస్2 సినిమాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవటం వల్ల రెండో వారం కూడా విరూపాక్ష థియేటర్లు ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.విరూపాక్ష సినిమా ద్వారా కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ అందుకున్న తేజ్ 100కోట్ల మార్క్ చేరుకొని టైర్ 1హీరోల లిస్ట్ లో చేరుతాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు