Agent: సురేందర్ రెడ్డి గ్రిప్ కోల్పోయాడా..?

అతనొక్కడే సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆ తర్వాత కిక్, రేసుగుర్రం సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. అయితే సురేందర్ రెడ్డి సినిమాల్లో స్టైలిష్ టేకింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. వక్కంతం వంశీ అందించే కథలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో డైరెక్షన్ చేసి చాలా సార్లు సక్సెస్ అయ్యాడు సురేందర్ రెడ్డి.

ధృవ సినిమాతో హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా సినిమాతో మెప్పించలేకపోయాడు ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సురేందర్ రెడ్డి.ఇవాళ విడుదలైన ఏజెంట్ సినిమా కి మిశ్రమ స్పందన వస్తోంది. కథలో కొత్తదనం లోపించిందని అంటున్నారు. స్పై సినిమాలకు కొన్ని సిమిలారిటీస్ ఉండటం సహజమే అయినప్పటికీ ఏజెంట్ సినిమా కథ ఇటీవల వచ్చిన పఠాన్, గూఢచారి సినిమాలకు చాలా దగ్గరగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి లో మునుపటి టేకింగ్ లేదని, గ్రిప్ కోల్పోయాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సుమారు రెండు సంవత్సరాల పాటు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని వాటిని అధిగమించి ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవటంతో అఖిల్ పడ్డ కష్టానికి ఫలితం అందకుండా పోయింది. ఏజెంట్ అలరించకపోవటానికి ప్రధాన కారణం కథలో కొత్తదనం లేకపోవటం, రొటీన్ కథకి ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోవటమే అని అంటున్నారు. మొత్తానికి ఏజెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ కి సురేందర్ రెడ్డి హిట్ ఇవ్వలేకపోయాడన్నమాట. ఏజెంట్ సినిమా విషయంలో జరిగిన లోపాన్ని సరిదిద్దుకొని నెక్స్ట్ సినిమాతో అయినా సురేందర్ రెడ్డి హైక్ కొడతాడో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు