Mega 157: బాలయ్యకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, ఇప్పుడు చిరు వంతు..!

ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తన జానర్ ని పక్కన పెట్టి బాలకృష్ణతో మాస్ ఎలిమెంట్స్ ని సెంటిమెంట్ తో ముడి పెట్టి భగవంత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా మహెష్ బాబు ని మాస్ యాంగిల్ లో చూపించి సక్సెస్ అయినప్పటికీ భగవంత్ కేసరి సినిమాతో తనలో పక్కా మాస్ డైరెక్టర్ కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు అనిల్.
అనిల్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందని, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు అని సమాచారం అందుతోంది.
భోళాశంకర్ సినిమా తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న చిరు ఇకపై ఏజ్ కి తగ్గ రోల్స్ చేయాలని డిసైడ్ అయినట్టు మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. చాలా కాలంగా కళ్యాణ్ కృష్ణ, చిరంజీవి కాంబినేషన్లో సినిమా రానుందని వార్తలున్న నేపథ్యంలో ఇటీవలే వశిష్ఠ డైరెక్షన్లో చిరు చేయబోయే సోషియో ఫాంటసీ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రావటంతో కళ్యాణ్ కృష్ణ సినిమా లేనట్లే అని క్లారిటీ వచ్చింది.
కళ్యాణ్ కృష్ణతో సినిమా విషయంలో మెగాస్టార్ బ్యాక్ స్టెప్ వేయటానికి భోళాశంకర్ సినిమా రిజల్ట్ కారణమని తెలుస్తోంది. మరి, బాలక్రిష్ణని ఏజ్ కి తగ్గ రోల్ లో చూపించి హిట్ అందుకున్న అనిల్ రావిపూడి చిరుని ఎలాంటి రోల్ లో చూపించనున్నాడు అన్నది ఆసక్తిగా మారింది. భగవంత్ కేసరితో మాస్ యాంగిల్ చూపించిన అనిల్ చిరుతో కూడా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేస్తాడా తనదైన ఎంటర్టైనర్ తో వస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు