Mega 157: చిరు నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్ తో అంటే..!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా కాలంగా టాక్ ఉంది కానీ, అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ, వశిష్ఠతో చేయబోయే సోషియో ఫాంటసీ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీంతో కళ్యాణ్ కృష్ణ సినిమా ఇక లేనట్లే అని క్లారిటీ వచ్చేసింది.

అయితే చిరంజీవి నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ తరువాతి సినిమా డైరెక్టర్ మారుతితో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. వశిష్ట డైరెక్షన్లో చేయబోయే సోషియో ఫాంటసీ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని 2025 సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే మారుతి వినిపించిన కథకి చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేయబోయే సినిమాతో బిజీగా ఉన్న మారుతి త్వరలోనే చిరు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడట.ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, సినిమా మీద మాత్రం ఆసక్తి పెంచుతోంది. వశిష్ట చిరుల సోషియో ఫాంటసీ సినిమా 2024 లో రిలీజ్ కానుంది.

- Advertisement -

ఇటీవల భోళాశంకర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న చిరుకి నెక్స్ట్ సినిమా హిట్ అవ్వటం చాలా కీలకం. భోళాశంకర్ సినిమా రిజల్ట్ తర్వాత చిరు థింకింగ్ మారిందని అందుకే కళ్యాణ్ కృష్ణతో సినిమా చేసే ఆలోచన విరమించుకున్నాడని తెలుస్తోంది. మరి, చిరు, మారుతి కాంబినేషన్లో రాబోయే సినిమా ఏ జానర్లో ఉండబోతుంది వంటి విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు