Ravanasura: లెనిన్‌గా మాస్ మహరాజా… బ్యాక్ టూ బ్యాక్ ప్రయోగాలు?

మాస్ మహారాజ్ “రవితేజ” ఎక్కడా తగ్గడం లేదు. లాస్ట్ ఇయర్ ధమాకా, ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య మల్టీ స్టారర్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రవన్న ఆ వెంటనే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు కూడా అందుకున్నాడు. అయినా సరే రవితేజ అందరి హీరోల్లా సినిమాల విషయంలో పెద్దగా గ్యాప్ తీసుకోకుండా, వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు.

ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి పెద్ద పీట వేస్తున్నాడు రవితేజ. అయితే ఇదేదో నిన్న మొన్నటి నుండి కాదు, చాలా రోజులకు ముందునుండే రవితేజ తన సినిమాల విషయంలో స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయంలో కొత్త రకంగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన పలు సినిమాలు కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎక్స్పెరిమెంట్ మూవీసే. ఈ ఇయర్ రిలీజ్ అయిన రావణాసుర లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తే, రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు 70స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బయోపిక్ సినిమా. అంతకు ముందు రాజా ది గ్రేట్ లో కూడా అంధుడిగా నటించిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా మరోసారి ఒక డిఫరెంట్ వే లో ఎక్స్పరిమెంట్ మూవీ రవితేజ చేయబోతున్నట్టు సమాచారం అందింది. “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా డైరెక్టర్ “మురళి కిషోర్ అబ్బూరు” తాజాగా రవితేజ కి “లెనిన్” అంటూ ఓ స్టోరీ లైన్ ని వినిపించారట. ఆ కథ నచ్చి పూర్తి కథ కూడా వినకుండా వెంటనే ఒకే చేసినట్టు టాక్ నడుస్తుంది. ఇక ఆ కథ 90స్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిందని పైగా ఆ సినిమాలో రవితేజ 90స్ కి చెందిన విలేజ్ కి చెందిన కుర్రాడిగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.

- Advertisement -

రవితేజ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలు రాయి గా నిలిచిపోతుందని సమాచారం. అయితే ఈ సినిమా పట్టాలెక్కేది “ఈగల్” రిలీజ్ అయిన తర్వాతేనట. మరి ఈ వార్త నిజమైతే మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇక పండగే. పైగా గత కొన్నేళ్లుగా 80స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు