Bigg boss season7: అంబటి అర్జున్… మామూలు కామెడీ టైమింగ్ కాదబ్బా!

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ గా రన్ అవుతుంది. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మెంబర్ల రాకతో హౌస్ మొత్తం సందడి గా సాగిందన్న సంగతి తెలిసిందే. ఆ హ్యాపీ మూమెంట్స్ కి కొనసాగింపు గా బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సరదా టాస్క్ లు పెట్టడం జరిగింది. ఇక ఆ టాస్క్ లో అంబటి అర్జున్ ఓ రేంజ్ లో కామెడీ ఎలివేట్ చేసాడు. అంబటి అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటినుండి హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా కంటిన్యూ అవుతూనే, తేజ తర్వాత తన పంచ్ లతో హౌస్ లో ఫన్ జెనరేట్ చేస్తున్నాడు. అలాగే నామినేషన్ టైం లో రెచ్చిపోతున్నాడు కూడా.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ అందర్నీ ఇమిటేట్ చేస్తూ, వాళ్ళ లా మాట్లాడి అందర్నీ ఇంప్రెస్స్ చేసాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, యావర్, శోభా ని ఓ రేంజ్ లో ఇమిటేట్ చేసి కామెడీ పండించాడు. వాళ్ళు నామినేషన్ టైం లో చేసే రచ్చ అంతా స్పూఫ్ గా చేసి వాళ్ళని తెగ నవ్వించాడు.

ఇక అర్జున్ కాకుండా అమర్ దీప్ కూడా హౌస్ మేట్స్ ని తన పాటలతో ఇంప్రెస్స్ చేసాడు. అయితే ఈ సరదా ప్రోగ్రాం తర్వాత వెంటనే హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇక ఆ టాస్క్ లో అందరూ పోరాడగా, గౌతమ్, శివాజీ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఇక ఆ టాస్క్ లో ఫైనల్ ప్లేయర్స్ గా శివాజీ, అర్జున్ నిలవగా, నాగార్జున ముందే అందులో కెప్టెన్ ఎవరో ఎన్నుకోమని హౌస్ సభ్యుల్ని కోరగా, ఎక్కువ మంది శివాజీకి ఓట్ వేసే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు