Manisharma : వాళ్ళకి రెండిస్తే నాకొక్కటైనా ఇవ్వండి.. నేనెంటో చూపిస్తా..!

తెలుగు సినీ జనాలకు, సంగీత ప్రియులకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోల సినిమాల్లో మ్యూజిక్ అంటే ఆల్మోస్ట్ మణిశర్మ పేరే వినిపించేది. ముఖ్యంగా చిరంజీవి, మహేష్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో మణిశర్మ ఇచ్చే మ్యూజిక్ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉండేది. అయితే దాదాపు ఇరవై యేళ్ళు టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఈ స్వరబ్రహ్మ గత పదేళ్ళలా అంతగా ఫామ్ లో లేడు.

అడపా దడపా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో కం బ్యాక్ ఇచ్చినా, ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. ఇక రాక రాక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఆఫర్ ఇవ్వగా, ఆ సినిమాయేమో డిజాస్టర్ అయ్యి కూర్చుంది. అయితే మణిశర్మకు తన పాటల విషయంలో న్యాయం చేశాడన్న పేరు దక్కింది.

ఇక ప్రస్తుతం మణిశర్మ కన్నప్ప, డబల్ ఇస్మార్ట్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. రీసెంట్ గా మణిశర్మ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి, ఇంకా తన ఒకప్పటి లైఫ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూ చివర్లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన పరిస్థితిని తలచుకుంటూ ఒక రకంగా చిన్న పాటి ఎమోషనల్ అయ్యాడు మణిశర్మ.

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని, హిట్లు రాకపోయినంత మాత్రాన మళ్ళీ మ్యూజిక్ బాగా ఇవ్వలేమని డిసైడ్ చేయకూడదు. టాప్ హీరోలైన పవన్, మహేష్ వంటి హీరోలు అలోచించి అందరికి అవకాశం ఇవ్వాలని అన్నారు. థమన్, దేవిశ్రీ లాంటి వాళ్లకు రెండు ఛాన్స్ లు ఇస్తే, తనకి ఒక్క సినిమా అయినా ఇవ్వండి చాలు అన్నాడు.

అయితే మణిశర్మ లాంటి గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది బ్యాడ్ టైం అనే చెప్పాలి. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని కలిసొస్తే ఈ 2024లో ఆయన సాలిడ్ కం బ్యాక్ ఇవ్వొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు