Super Star: మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు కష్టాలు – ఆగిన షూటింగ్..! 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు మహేష్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మహేష్ ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇవ్వాలని కోరగా త్రివిక్రమ్ షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తోంది.

మహేష్ బాబుకి స్కిన్ అలర్జీ ఉండటం వల్ల ఎండలో తిరగొద్దని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. సాధారణంగా సమ్మర్ సీజన్ లో షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి వెకేషన్ కి వెళ్లే మహేష్ బాబు ఈ ఏడాది సమ్మర్ సీజన్ మొదట్లోనే కుటుంబ సమేతంగా వెకేషన్ పూర్తి చేసుకొని వచ్చాడు. ఇక ఎండ తీవ్రత వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్ ఫ్యామిలీతో పాటు మరో వెకేషన్ వెళ్లనున్నట్లు సమాచారం.

2024 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అసలే త్రివిక్రమ్ సినిమాలు నిదానంగా షూట్ చేస్తాడు అన్న టాక్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు బిగినింగ్ లోనే బ్రేక్ పడటం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.త్రివిక్రమ్ మహేష్ ని ఈ సినిమాలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, కొత్తరకమైన డైలాగ్ మాడ్యులేషన్ తో చూపించబోతున్నాడు అన్న వార్తల నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో మహేష్ బాబు నుండి కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు