Tollywood: ప్రభాస్ – మారుతి సినిమాలో హైలైట్ అదేనా..?

కామెడీ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు మారుతి, రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలొస్తున్న ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ మాళవిక మధ్య లవ్ ట్రాక్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మారుతి మార్క్ ఎంటర్నైన్మెంట్ టచ్ తో లవ్ ట్రాక్ నడుస్తుందని అంటున్నారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తీయాలన్న పట్టుదలతో దర్శకుడు మారుతి ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.

వరుస యాక్షన్ సినిమాలతో ఉన్న ప్రభాస్ లైనప్ లో లవ్ ట్రాక్ ప్రదానంగా ఉన్న ఈ సినిమా రిఫ్రెషింగ్ గా ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు అనగానే అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా ఈ సినిమా రూపొందించాలని మారుతి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత ప్రభాస్ సినిమాలో లవ్ ట్రాక్ ప్రధానంగా ఉండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారంటూ వార్తలు రావటంతో అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ కెరీర్లో తొలిసారి పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ సినిమాలో నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవనున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు