Tollywood: క్రేజీ బ్యాక్డ్రాప్ – టాప్ డైరెక్టర్ – ప్రభాస్ నెక్స్ట్ మూవీ..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలను లైనప్ లో పెట్టిన ప్రభాస్ డైరెక్టర్ సుకుమార్ తో ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఆ మధ్య షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన సమయంలో ప్రభాస్ కి ఓ కథ వినిపించారని, ఆ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. రజాకర్ల ఉద్యమం నేపథ్యంలో సాగే కథని వినిపించిన సుకుమార్ పుష్ప2 సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఆ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పని మొదలెడతాడని అంటున్నారు.

ప్రభాస్ లాంటి కటౌట్ కి రజాకర్ల ఉద్యమం లాంటి నేపథ్యం తోడైతే అన్న ఊహే హీట్ పెంచుతోంది. అందులోను రంగస్థలం, పుష్ప సినిమాలతో తనలోని మాస్ యాంగిల్ తో రెచ్చిపోయిన సుకుమార్ డైరెక్షన్ అనగానే అంచనాలకు ఆకాశమే హద్దు అన్న పరిస్థితి ఏర్పడింది. వరుస సినిమాలను తన లైనప్ లో పెట్టిన ప్రభాస్ వచ్చే రెండు సంవత్సరాలు బిజీగా ఉండే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఉండబోతోంది అన్న వార్తలు వచ్చాయి. లైగర్ సినిమా డిజాస్టర్ అయిన ప్రభావమో లేక మరే కారణం ఏమైనా ఉందేమో తెలీదు కానీ, ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టు అనిపిస్తుంది.

స్క్రిప్ట్ దశలో ఉండగానే హీట్ పెంచుతున్న ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చాలంటే రెండేళ్లకు పైగానే సమయం పట్టేట్లు ఉంది. వరుస యాక్షన్ సినిమాలతో వస్తున్న తరుణంలో ఈ పీరియాడిక్ డ్రామా ప్రభాస్ లైనప్ కి కొత్తదనాన్ని యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్సమెంట్ రాని ఈ కాంబినేషన్ పై మరిన్ని వివరాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు