Varalakshmi : లేడీ విలన్‌కు ఫుల్ డిమాండ్..

“తమిళంలో నాకు అవకాశాలు రావడం లేదు.. 2011లో కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి 9 ఏళ్లపాటు వరుసగా సినిమాలు చేస్తున్నాను. అయినా, నాకు ఇక్కడ సరైనా గుర్తింపు రావడంలేదు. కానీ, తెలుగులో మాత్రం మంచి గుర్తింపు వచ్చింది” ఈ మాటలు కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నుంచి వచ్చాయి. వరలక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొండ్రాల్ పాపమ్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేసింది.

నిజానికి వరలక్ష్మీకి కోలీవుడ్ లో కంటే, టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు ఉంది. అలాగే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు దర్శక నిర్మాతలకు లేడీ విలన్ పాత్ర గురించి ఆలోచిస్తే.. ముందుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పేరే కనిపిస్తోంది. అందుకే చాలా సినిమాల్లో లేడీ విలన్ గా వరలక్ష్మీ కనిపించింది. అలాగే ఈమె ప్రత్యామ్నాయంగా ఎవరూ కూడా లేరు. దీనికి తోడు వరలక్ష్మీ తన నటనతో అందరినీ మెప్పిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు.

దీంతో లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటి ఆప్షన్ అవుతుంది. అయితే దీన్ని వినియోగించుకోవాలని వరలక్ష్మీ చూస్తోెంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదీద్దుకోవాలి అన్నట్టు.. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే ఉన్న రెమ్యునరేషన్ ను ఇంకాస్త పెంచేసి.. హీరోయిన్ల స్థాయి పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

- Advertisement -

రెమ్యునరేషన్ తగ్గితే సినిమా చేసేదే లేదు అని నిర్మాతలకు కూడా తెల్చి చెప్పేస్తుందట. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ లేడీ విలన్ కాబట్టి.. నిర్మాతలకు కూడా వరలక్ష్మీ అడిగినంద ఇచ్చేసి సినిమాలకు సైన్ చేయించుకుంటున్నారని తెలుస్తోంది.

నిజానికి వరలక్ష్మీ చేసే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తోంది. ఇటీవల ఈమె నటించిన యశోద, వీర సింహారెడ్డి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమాల్లో వరలక్ష్మీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ పాత్రల్లో వరలక్ష్మీ కాకుండా.. మరి ఏ నటి కూడా సెట్ కాదు అని చెప్పొచ్చు. అలాంటి నటికి రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ ఇచ్చినా.. సమస్య ఉండదు అని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు