Kangana Ranaut: రాజమౌళి జోలికి వస్తే ఊరుకోను

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటించిన ఘనత రాజమౌళిది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు తొంగి చూసేలా చేశారు ఈ దర్శక ధీరుడు. తెలుగోడి సత్తాకు హాలీవుడ్ దిగ్గజాలు సైతం సలాం కొట్టేలా చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు చేసి రికార్డులు తిరగరాశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ రేసులో నిలిచేలా చేశారు.

ఈ క్రమంలో పలు ఆంగ్ల పత్రికలు, మ్యాగజైన్ లకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ” ది న్యూయార్కర్” మేగజైన్ తో ఆయన మాట్లాడుతూ.. మతం, హిందూ గ్రంథాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు రాజమౌళి. తనకు మహాభారతం, రామాయణం పట్ల ప్రేమ ఉందని తెలిపారు. క్రైస్తవ మతాన్ని కూడా అనుసరించానని, ఆ తరువాత స్వలాభం కోసమే మతం అన్న విషయం అర్థమైంది అన్నారు.

తన కజిన్ ద్వారా అయాన్ రాండ్ ది ఫౌంటెన్ హెడ్, అట్లాస్ ప్రగ్డ్ చదివానని.. వాటి నుండి ఎంతో స్ఫూర్తి పొంది అప్పటినుండి మతానికి దూరంగా జరుగుతూ వచ్చానని తెలిపారు. అయితే రాజమౌళి ఇలా మతం పై తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాజమౌళికి సపోర్టుగా వరుస సోషల్ మీడియాలో వరుస పోస్టులు వేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఆయనను లక్ష్యంగా చేసుకోవద్దని రైట్ వింగ్ కు హితువు పలికింది. “మీరు దీనిపై అతిగా స్పందించనవసరం లేదు. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. కళాకారులకు ప్రత్యేకించి రైట్ వింగ్ మద్దతు లభించదు. మేధావి, జాతీయవాది అయిన రాజమౌళి సార్ కి వ్యతిరేకంగా దేన్నీ నేను సహించను. వర్షంలో వెలిగే అగ్ని కణం లాంటి వ్యక్తి ఆయన. రాజమౌళి ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన అలాంటి వ్యక్తి మనకు ఉన్నందుకు గర్వించాలి. ఆయన దేశం పట్ల అంకిత భావం కలిగి ఉన్నారు. ఈ జాతి వ్యక్తిగా రాజమౌళి సమగ్రతను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించింది.

ఇక మరో పోస్ట్ వేస్తూ.. ” ప్రపంచం ఆయనపై వివాదాస్పదమైన ముద్ర ఎందుకు వేసింది? ఆయన చేసిన వివాదం ఏంటి? మన నాగరికతను కీర్తించడానికి బాహుబలి అనే సినిమా తీసినందుకా? లేక మన జాతి గర్వించేలా ఆర్ఆర్ఆర్ సినిమాని తీశాడనా? ఆయన అంతర్జాతీయంగా రెడ్ కార్పెట్లకు మన ధోతిని ధరించాడనా? అతను చేసిన వివాదం ఏమిటి? దయచేసి చెప్పండి” అంటూ సూటిగా ప్రశ్నించింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు