Ketika Sharma: ఆ వీడియోలను షేర్ చేసిన కేతిక శర్మ

Ketika Sharma

హాట్ బ్యూటీ కేతిక శర్మ ఈ మధ్య కాలంలో ఏం చేసిన సెన్సేషనల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోజులిస్తూ ఫొటోలు దిగే ఈ బ్యూటీ లేటెస్ట్ ఆమె పర్సనల్ వీడియోలను కొన్ని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. మరి ఆ వీడియోలు ఏమై ఉంటాయా అని అనుకుంటున్నారా.. అవేంటంటే ..

అందం కావాల్సినంత ఉన్న అదృష్టం కలిసి రాని యంగ్ బ్యూటీ కేతిక శర్మ రొమాంటిక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేసిన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అన్ సీజన్ లో పడే వర్షాలలాగా అప్పుడొకటి అప్పుడొకటి వస్తూ ఉన్నాయి. ఇటీవలనే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కనిపించింది ఈ భామ.. కానీ ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో మళ్ళీ ఈ హీరోయిన్ కు అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.

ఇక లేటెస్ట్ గా కేతిక శర్మ తాను గతంలో చేసిన డబ్ స్మాష్ వీడియోలను తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో షేర్ చేసింది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేయకముందు తాను చేసిన ఆ డబ్ స్మాష్ వీడియోలను అందరితో పంచుకొని మురిసిపోయింది ఈ భామ. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేక ఖాళీగా ఉంటుండడంతో ఈ విధంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది కేతిక.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు