Keerthy Reddy : సుమంత్ ను పెళ్లి చేసుకోకపోతే.. నా జీవితం బాగుండేది

అలనాటి టాలీవుడ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి రెడ్డి ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మసులుకుంటున్న కీర్తి రెడ్డి కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నటుడు సుమంత్ ని 2004లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరిద్దరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 2006లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి ఈమె దూరంగా వెళ్లిపోయింది. విడాకుల తర్వాత ఆమె ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యింది.

అయితే, తాజాగా సుమంత్ గురించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి రెడ్డి, ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సుమంత్ ను పెళ్లి చేసుకున్నాక ఈమెకు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయని తెలిపింది. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని భావించిన తాను అలాంటి అద్భుతమైన అవకాశాలు అన్నింటినీ వదులుకున్నానని పేర్కొంది. తన జీవితంలో సుమంత్ ను పెళ్లి చేసుకొని ఉండకపోతే తన జీవితం ఇంకా బాగుండేదని, ఈ సందర్భంగా నటి తెలియజేశారు. కాగా, ఇక కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్న తర్వాత సుమంత్ ఇప్పటివరకు ఒంటరిగానే గడుపుతున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు