Powerstar: ఉస్తాద్ కి కూడా వీరమల్లు పరిస్థితి తప్పదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు పాలిటిక్స్, అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే, వీటిలో సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో నటించిన బ్రో సినిమా విడుదలకి సిద్ధమవుతుండగా, మిగతా సినిమాల్లో ఓజి సినిమా షూటింగ్ మాత్రమే శరవేగంగా జరుపుకుంటుంది. చాలా కాలం కిందట క్రిష్ డైరెక్షన్లో మొదలైన హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అందట్లేదు.

పవన్ కళ్యాణ్ ఓజి సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో మిగతా సినిమాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఇంకా 100రోజుల వరకు పవన్ కళ్యాణ్ డేట్స్ అవసరం ఉండగా అవి ఇప్పట్లో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. పవన్ ప్రస్తుతం పొలిటికల్ క్యాంపైన్ లో బిజీగా ఉండగా మధ్యలో గ్యాప్ ఇచ్చి ఓజి షూట్ లో జాయిన్ మళ్ళీ పొలిటికల్ క్యాంపైన్ కి వెళ్లే ప్లాన్ లో ఉన్నాడట. పైగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో పవన్ ఓజి షూటింగ్ కంప్లీట్ చేసి పూర్తి ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఎలక్షన్ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే, ఆ హడావిడిలో పడి పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ రిజల్ట్ నెగిటివ్ గా వచ్చినా కూడా ఆ మూడ్ బయటపడటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ ఆరు నెలల్లో జరిగే సూచనలు కనిపించట్లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు