AA22: అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో నుండి మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్స్ గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గీత ఆర్ట్స్ నుండి ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. జూన్ 3న అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఉంటుంది అంటూ ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. ఈ ట్వీట్ లో హారిక హాసిని సంస్థను కూడా ట్యాగ్ చేయటంతో ఈ అప్డేట్ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా గురించే అని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ ఈ అప్డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాతో సహా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ అన్నీ తానై వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది తదితర వివరాల పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆహా కోసం అల్లు అర్జున్, శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ యాడ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పుష్ప2 సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సినిమా యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. పుష్ప పార్ట్1 పాన్ ఇండియా వైడ్ ఊహించిన దానికంటే ఎక్కువ రేంజ్ లో సక్సెస్ కావటంతో సుకుమార్ పార్ట్2 ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని అందుకే షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు