BRO: స్టిల్ మాత్రం అరాచకం ‘బ్రో’..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి సముద్రఖని డైరెక్షన్లో నటించిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘వినోదాయ సీతాం’ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సినిమాకున్న హైప్ ని అమాంతం పెంచేసింది. ఒరిజినల్ తో సంబంధం లేకుండా పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేసి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు సముద్రఖని తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. జల్సా సినిమా సమయంలో ఒక ఊపు ఊపిన స్టిల్ ని ఈ సినిమాలో వాడుకున్నాడు డైరెక్టర్.

ఆ స్టిల్ చుస్తే, పబ్ షూట్ చేసిన సాంగ్ లోనిది అని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టట్లేదని కామెంట్స్ వస్తున్న తరుణంలో ఈ స్టిల్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. మొదట్లో రీమేక్ సినిమా అని నిరుత్సాహ పడిన పవన్ అభిమానులు మొన్న విడుదలైన టీజర్, తాజాగా డైరెక్టర్ లీక్ చేసిన ఈ స్టిల్ చూసి ఫిదా అవుతున్నారు.

జులై28న విడుదలవుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ్ నుండి వస్తున్న సినిమా కావడం, అందులోను మామా అల్లుళ్లు తొలిసారి కలిసి నటించిన సినిమా కావడం వల్ల ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి, హరీష్ శంకర్ తరహాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ తెరపై చూపిస్తున్న సముద్రఖని గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు