Rangabali: అలాంటి రచయితకు ఇలాంటి పాత్రల్లో నటించడం అవసరమా?

టాలీవుడ్ లో ఇప్పుడున్న అద్భుతమైన పాటల రచయితల్లో ఒకరు “అనంత శ్రీరామ్”. సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ తర్వాత ఆ స్థాయి లో పాటలకు రచించే యువ రచయిత ఎవరైనా ఉన్నారంటే, అది అనంత శ్రీరామ్ అనే చెప్పాలి. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” టైటిల్ సాంగ్ ని కేవలం 20నిమిషాల్లో రాసిన ఉద్ధండుడు అనంత శ్రీరామ్. ఇలా ఎన్నో సినిమాలకు తనదైన శైలిలో, అన్ని రకాల పాటలు రాసిన అనంత శ్రీరామ్ లేటెస్ట్ గా “రంగబలి” అనే చిత్రంలో నటించాడు.

ఆ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించగా, విలన్ గా నటించిన టామ్ చాకో షైన్ పక్కన అసిస్టెంట్ గా నటించాడు.ఇక ఆ సినిమాలో విలన్ పాత్రే పేలవం అంటే, విలన్ పక్కన కమెడియన్ లాగా అనంత శ్రీరామ్ పాత్రని డిజైన్ చేసారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రంగబలి సినిమా డిజాస్టర్ గా నిలవగా, అయినా సరే ఆ సినిమా డైరెక్టర్ ని కామన్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లాంటి గొప్ప రచయితకి ఇలాంటి చెత్త రోల్ ఇస్తావా అంటూ డైరెక్టర్ ని ఏకిపారేస్తున్నారు.

అయితే ఒక గొప్ప రచయితైనా అనంత శ్రీరామ్ కూడా ఈ సినిమాలో నటించాల్సింది కాదని, అలా నటించాల్సి వస్తే ఏదైనా గుర్తింపు ఉండే పాత్ర చేయాలిగాని ఇలా పేరులేని కమెడియన్ లాగా వేషం వేయొద్దని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. బహుశా తన పాత్ర అలా అంటుందని ఆయన కూడా గెస్ చేసి ఉండడేమో. ఇక ఇంతకు ముందు కూడా సాక్ష్యం అనే చిత్రంలో అనంత శ్రీరామ్ ఒక ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర అనంత శ్రీరామ్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు