Milky Beauty: ఇందులో కూడా తమన్నా పాటని లేపేస్తారా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగష్టు11న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పేరుకి మెగాస్టార్ సినిమాయే అయినా కూడా ఈ సినిమాపై అభిమానులు అంతగా అంచనాలు పెట్టుకోలేదన్నది వాస్తవం. ఇప్పటివరకు ఈ సినిమాని చిరంజీవి సినిమా అన్న హైప్ తప్ప మరే ప్లస్ పాయింటు లేదు. అసలే రీమేక్ సినిమా అంటే, అందులోను ఒక నార్మల్ కమర్షియల్ సినిమాను రీమేక్ చేసారు. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, పాటలు బాగానే ఉన్నా కొత్తదనం మిస్ అయింది.

ఇక తాజాగా భోళా శంకర్ లో మూడో సాంగ్ ని లాంచ్ చేయడం జరిగింది. మిల్కీ బ్యూటీ పేరుతో రిలీజ్ అయిన పాట చిరు మార్క్ మెలోడీతో బాగానే ఉంది కానీ, ఆ పాటకి అసలు మైనస్ పాయింట్ తమన్నాయే. అవును.. క్యాచి మెలోడీతో సాగే ఆ పాటలో తమన్నా చిరంజీవి పక్కన అస్సలు సూట్ కాలేదు. దీనికి సోషల్ మీడియా లో కూడా తీవ్రమైన నెగిటివిటి వచ్చింది. పైకి ఫ్యాన్స్ బాగుందని చెపుతున్నా, లోలోపల ఫీల్ అవుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆ పాట వల్ల వచ్చిన డ్యామేజీని కంట్రోల్ చేసే పనిలో ఉంది.

అయితే మేకర్స్ పాటకు వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ వల్ల పాటని సినిమాలో ఉంచుతారా? లేక తీసేస్తారా అన్నది ప్రశ్నగా మారింది? ఎందుకంటే గతంలో చిరు “సైరా” చిత్రంలోనూ చిరుతో తమన్నా నటించగా, అందులోను “అందం అంకితం” అనే పాటలో చిరంజీవితో ఆడిపాడింది. కానీ ఆ పాటలో చిరు తమన్నా మధ్య కెమిస్ట్రీ మ్యాచ్ కాకపోవడంతో సినిమా నుండి తీసేయడం జరిగింది. మరి భోళా శంకర్ లో కూడా చిరు తమన్నా మధ్య పాటలు తీసేస్తారా అన్న చర్చ నడుస్తుంది. అది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు