Happy birthday Suriya- కంగువ గ్లిమ్స్ విడుదల

ప్రేక్షకులంత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్య లేటెస్ట్ సినిమా కంగువ గ్లిమ్స్ ఎట్టకేలకు విడుదలైంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. గతకొద్ది రోజుల నుంచి ఆసక్తికరమైన స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఈరోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను ఈరోజు తెల్లవారుజామున రిలీజ్ చేసారు మేకర్స్

ఒక్కమాటలో గ్లిమ్స్ వీడియో గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఈ మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాల టీజర్ లు, గ్లిమ్స్ వీడియోలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని అందరికి తెలిసిందే. కానీ కంగువ గ్లిమ్స్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేల ఉంది. సినిమా కోసం ఎదురు చూసిన  ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండేలా ఉంది. ప్రతి ఫ్రెమ్ కూడా అద్భుతంగా, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. డైరెక్టర్ శివ తన పూర్తి స్థాయి ఎఫర్డ్స్ పెట్టి సినిమాను తీర్చి దిద్దినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటని హీరోయిన్ గా నటిస్తోంది. గ్లిమ్స్ వీడియోను బట్టి చూస్తే.. ఈ కథ క్రీస్తు పూర్వం జరిగే కథలాగా తోస్తుంది. అలాగే సూర్య గెటప్ అడవిలో ఉండే తెగల వారిని రిప్రెసెంట్ చేసేలా ఉంది. ఇక సూర్య గ్లిమ్స్ లో చెప్పిన కుశలమా అనే డైలాగ్ వీడియోకే హై లెట్ అని చెప్పవచ్చు. ఇటీవలనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పీఎస్ టూ సినిమా తరువాత కోలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం అవడంతో ప్రేక్షకుల్లో కంగువ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా రిలీజ్ డేట్ ను మాత్రం ఎక్కడకూడ మేకర్స్ తెలియబరచక పోవడం గమనార్హం.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు