PMF: మారుతీ ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలైంది, ఎంతవరకు పూర్తయింది, నటీనటులు ఎవరనే విషయంపై ప్రేక్షకుల్లో చాలా వరకు కంఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకరు ఇద్దరు నటులు మీడియా ముఖంగా మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేసే చేసే సినిమాలో తాము నటిస్తున్నామంటూ కన్ఫామ్ చేసిన, అఫీషియల్ గా మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాపై ఏ విధమైన అప్డేట్ రాలేదు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ప్రభాస్ మారుతీల సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఏ విధమైన అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదని నిర్మాతను ప్రశ్నించగా ఆయన తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల బ్రో సినిమా రిలీజ్ అవబోతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రభాస్ సినిమాపై నోరు విప్పక తప్పలేదు.

ప్రస్తుతం సలార్, కల్కి 29898AD (ప్రాజెక్ట్ కే) సినిమాల జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారని ఈ సినిమాల హడావిడి తగ్గితే అప్పుడు మారుతీ ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం అని ఆయన అన్నారు. ఇంతకు మించి సినిమా గురించి ఏమి రివీల్ చేయలేము అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన సినిమా బడ్జెట్ విషయంలో క్లారిటీ ఇస్తూ అందరు అనుకుంటున్నట్టుగా మారుతీ సినిమా చిన్న బడ్జెట్ సినిమా కాదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఒక్కసారి సలార్, కల్కి 29898AD సినిమాలు రిలీజైపోతే మారుతీ సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని అయన చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే మారుతీ ప్రభాస్ సినిమా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు