BholaShankar: ఈ సినిమా ఫలితంతో అనిల్ సుంకర హ్యాపీయేనా?

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ గురించి తెలిసిందే. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలుగా ఈ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించడం జరిగింది. దూకుడు, లెజెండ్, సరికేరు నీకెవ్వరూ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ఈ సంస్థ బడ్జెట్ కి వెనకాడకుండా చిత్రాలను నిర్మించే సంస్థలలో ఒకటిగా పేరుపొందడం జరిగింది.

అయితే ఈ సంస్థ నుండి గత మూడేళ్లుగా సరైన సినిమాలు రాలేకపోతున్నాయి. 2020లో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సంస్థ ఖాతాలో ఒక్క హిట్ లేదు. బంగారు బుల్లోడు, మహా సముద్రం లాంటి సినిమాలు దారుణమైన ప్లాప్ లుగా మిగిలాయి. ఇక రీసెంట్ గా ఎంతో భారీ ఖర్చుతో తీసిన ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయ్యి నిర్మాతలకి కన్నీళ్లే మిగిల్చింది. ఈ సినిమా దాదాపు 50కోట్ల వరకు నష్టం తెచ్చిందని టాక్.

అయితే ఈ బ్యానర్ నుండి తాజాగా రిలీజ్ అయిన సామజవరగమన అనే సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నిర్మాత అనిల్ సుంకర చాలా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తుంది. అనిల్ సుంకర ఈ సినిమాకి సగ భాగస్వామ్య నిర్మాతే అయినప్పటికీ ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఆ బ్యానర్ లో హిట్ స్టేటస్ ని దక్కించుకుంది.

- Advertisement -

అయితే అనిల్ సుంకర కి ఏజెంట్ తెచ్చిపెట్టిన భారీనష్టాల ముందు సామజవరగమన ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆ నష్టాలను భర్తీ చేయలేదు. కానీ కొంత వరకు లాస్ ని రికవరీ చేయొచ్చు. ఇక ప్రస్తుతం ఆ బ్యానర్ నుండి వస్తున్న భోళా శంకర్ చిత్ర ప్రమోషన్ పనుల్లో ఉన్నారు మేకర్స్. సామజవరగమన తో సక్సెస్ అందుకున్న ఈ బ్యానర్ భోళా శంకర్ తో దాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు