Rangabali: ఈ సినిమా కూడా ఆడకపోతే అంతే సంగతి..!

యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగశౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ సత్యతో చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూ క్లిక్ అవ్వటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఊహలు గుసగుసలాడే, ఛలో వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న నాగశౌర్య ఈ మధ్య కథలు ఎంచుకోవడంలో లోపమో, ఇంకేదైనా కారణం వల్లనో కానీ వరుస డిజాస్టర్స్ అందుకున్నాడు.

రంగబలి సినిమా హిట్ అవ్వటం నాగశౌర్య కెరీర్ కి కీలకంగా మారింది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. డెబ్యూ డైరెక్టర్ పవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ కి ముందు పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు గనక డీసెంట్ టాక్ సొంతం చేసుకుంటే నాగశౌర్య ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ సొంతం అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తరుణంలో నాగశౌర్య రేస్ లో నిలవాలంటే ఈ సినిమాతో ఎలా అయినా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జానీ సినిమాలోని సాంగ్ కి నాగశౌర్య, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కలిసి స్టెప్స్ వేయటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి, నాగశౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు