Pawan kalyan: ఈ అప్డేట్ తో “బ్రో” విషయంలో ఆ డౌట్ క్లియర్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన తాజా చిత్రం “బ్రో”. ఈ సినిమా వినోదయ సితం కి రీమేక్ గా తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ తీసిన సముద్రఖనియే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా, స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి తెరకెక్కించారు. అదీ గాక బ్రో సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తుండడంతో దీనికి చాలా ప్లస్ అవుతుంది.

ఇక బ్రో సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ రోజు వచ్చిన ఈ అప్డేట్ లో సాంగ్ పేరు “మై డియర్ మార్కండేయ” అనే టైటిల్ తో పాట రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ అప్డేట్ వల్ల మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తుంది.

అదేంటంటే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గాడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ గాడ్ పాత్ర లేదనేది చాలా మంది అభిమానుల ప్రశ్న. తాజాగా ఈ సాంగ్ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ శివుడిగా సాయిధరమ్ తేజ్ ని కాపాడడానికి వస్తాడని తెలుస్తుంది. పాటలో “మై డియర్ మార్కండేయ” అని అన్నారంటే ఆ మార్కండేయుడు శివుడి భక్తుడు కాబట్టి, పవన్ కళ్యాణ్ శివుడి పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. ఇక “గోపాల గోపాల” మూవీలో మహా విష్ణువుగా కనిపించిన పవన్ ఈ సినిమాలో శివుడిగా కనిపిస్తున్నాడన్నమాట. అయితే ఈ సినిమా యొక్క లిరికల్ సాంగ్ వస్తుందన్నారు కానీ ఎప్పుడొస్తుందో చెప్పలేదు. బహుశా జులై 8 లేదా 9న ఫస్ట్ సాంగ్ విడుదల చేయవచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు