BholaShankar: జెట్ స్పీడ్ లో ఉన్న చిరు! ఆ పని కూడా మొదలెట్టేసారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్ రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైమ్ కూడా దగ్గర పడుతుండడంతో ఈ సినిమా యొక్క అన్ని పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు, మార్కెటింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేసేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి తెలియచేసారు.

అదేంటంటే భోళా శంకర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తన డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసానని తెలియచేసారు. ఇక భోళా శంకర్ ద్వారా ఒక ప్యూర్ మాస్ ఎంటర్టైనర్ ని అందిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక భోళా శంకర్ కి సంబంధించి రీసెంట్ గా విడుదలైన టీజర్ కూడా మెప్పించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ మెప్పించిన విధంగానే సినిమా కూడా బాగుంటే హిట్ విషయం అభిమానులు చూసుకుంటారని నెటిజన్లు అంటున్నారు.

ఇక భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించగా, తమన్నా హీరోయిన్ గా నటించడం జరిగింది. కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా నటించిన విషయం తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ తో జోరు మీదున్న చిరు భోళా శంకర్ తో మరో సాలిడ్ హిట్టు కొట్టి తన హవా కంటిన్యూ చేయాలనీ చుస్తున్నారు. ఆగష్టు 11న విడుదల అవుతున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు