Intinti Ramayanam: అల్లు అరవింద్ స్ట్రాటజీ మిస్ ఫైర్ అయ్యిందా..?

రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రల్లో సురేష్ నరెడ్ల దర్శకత్వంలో రూపొందిన ఇంటింటి రామాయణం సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట ఆహాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, బలగం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో అదే బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను కూడా థియేటర్లో రిలీజ్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో డెసిషన్ తీసుకోవటం వల్ల పెద్దగా ప్రమోషన్ చేయటానికి సమయం లేక సైలెంట్ గా రిలీజ్ చేశారు. సినిమా కథ మీద నమ్మకంతో మౌత్ టాక్ మీద డిపెండ్ అయ్యి రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది. ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో గనక రిలీజ్ చేసుంటే మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదని అభిప్రాయం వెల్లడవుతోంది. మొత్తానికి బలగం సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని థియేటర్లకు వచ్చిన ఈ సినిమా యూనిట్ అంచనాలను తలకిందులు చేసింది.

తెలంగాణ బ్యాక్డ్రాప్ ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా బలగం రేంజ్ లో హిట్ అవుతుందని అనుకుంటే అంతకు మించి ఫులిష్ నెస్ ఉండదని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయ్యింది. ఒకే రోజు ఐదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వటం కూడా ఈ సినిమా మైనస్ అయ్యిందని చెప్పచ్చు. ఇదే రోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క విమానం పర్వాలేదని అనిపించగా మిగతా ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు