టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు. పోకిరి టైం లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది ఇలియానా. నడుము అంటే తనలా ఉండాలి అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోయిన్ ఇలియానా. ఈ నడుము అందాల సుందరి దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయమైంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి, మంచి పేరు తెచ్చుకుంది. గతంలో సన్నగా ఉండే ఈ భామ ప్రస్తుతం చాలా బొద్దుగా తయారైంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా చాన్సులు రాకపోవడంతో బాలీవుడ్ కు తరలి వెళ్ళింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ, యూత్ ను తన వైపు లాగేసుకుంటుంది.
ఇది ఇలా ఉండగా తన పర్సనల్ లైఫ్ లో కొత్త తోడు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెభాష్టియన్ తో ఇలియానా ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా కత్రినా కుటుంబ సభ్యులతో కలిసి ఇలియానా ఇటీవల లాంగ్ టూర్ వెళ్ళింది. ఈనెల 16న కత్రినా కైఫ్ తన 39వ బర్త్ డేను మాల్దీవుల్లో జరుపుకుంది. కత్రినా వెంట ఆమె భర్త, హీరో విక్కీ కౌశల్, సోదరుడు సెబాస్టియన్ తో పాటు ఇలియానా కూడా పాల్గొంది. అంతేకాదు కత్రినా కైఫ్ ఫ్యామిలీతో దిగిన సెల్ఫీ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా. దీంతో ఇలియానా, సెబాస్టియన్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇక ఆ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజెన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.