Aishwarya Laxmi: అవకాశాలు రావాలంటే అలా చెయ్యాల్సిందే.. ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

Aishwarya laxmi:

కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 2017 సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటినుండి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కోతా, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో సైతం పొట్టి పొట్టి దుస్తులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే ప్రస్తుతం సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభ, గ్లామర్ ఫస్ట్ ప్రియారిటిగా మారిపోయింది. ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్లు పబ్లిక్ గానే అంగీకరిస్తున్నారు. తాజాగా ఐశ్వర్య లక్ష్మి కూడా ఇదే విషయంపై స్పందిస్తూ అవుననే చెప్పింది. తాను మొదట డాక్టర్ అవ్వాలి అనుకుని డాక్టర్ చదివి ఆ తర్వాత మోడల్ రంగంపై ఆసక్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపింది.
ఆ తర్వాత పలు వాణిజ్య సంస్థలకు మోడల్ గా పనిచేసే సమయంలో ఆమె ఫోటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితం కావడంతో సినిమా అవకాశాలు రావడం జరిగిపోయాయట. అయితే ఇప్పుడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేయగా ఆ ఫోటోలు చూసి నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పై స్పందించిన ఐశ్వర్య లక్ష్మి.. గ్లామర్ కు మారడం తప్పనిసరి అని, అది లేకపోతే ఈ ఫీల్డ్ లో కొనసాగలేమని చెప్పుకొచ్చింది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries.
Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు