Liger: ముదురుతున్న లైగర్ వివాదం – పట్టు విడువని పూరి..!

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన లైగర్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా నష్టపోయిన ఎగ్జిబిటర్లు తమకు న్యాయం చేయాలంటూ ఫిలిమ్ ఛాంబర్ ఎదుట రిలే నీహారర దీక్ష చేపట్టారు. సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా దర్శకుడు పూరి జగన్నాధ్ తమని పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు. ఆచార్య సినిమా ద్వారా నష్టపోయిన తమకు మెగాస్టార్ చిరంజీవి 13కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారని, గతంలో డబ్బులు వెనక్కి ఇస్తానన్న పూరి, ఛార్మీలు ఇంతకాలం అయినా తమకు డబ్బులు తిరిగి ఇవ్వలేదని అంటున్నారు.

ఛాంబర్ ఎదుట నిరసన తెలుపుతున్న ఎగ్జిబిటర్లు మీడియాతో మాట్లాడుతూ తమని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ లైగర్ నిర్మాతలైన పూరి, ఛార్మీలకు వార్నింగ్ ఇచ్చారు. తమకి న్యాయం చేయకపోతే పూరి తదుపరి సినిమా డబుల్ ఇస్మార్ట్ ని నైజాం ఏరియాలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. చిరంజీవి లాంటి పెద్ద హీరో తన సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చి పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా తమ నష్టాన్ని తీర్చినపుడు, విజయ్ దేవరకొండకి అలాంటి ఆలోచన ఎందుకు రాలేదని అంటున్నారు.

మొత్తానికి రోజురోజుకి ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. ఈ విషయంలో పూరి తన మనసు మార్చుకొని స్పందిస్తే తప్ప ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అసలే లైగర్ సినిమాతో తీవ్రంగా నష్టపోయిన పూరి, సకాలంలో స్పందించి సమస్యని పరిష్కరించకపోతే తన నెక్స్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్ కి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు