Power Star: ఎట్టకేలకు ‘వీరమల్లు’ వైపు మళ్ళిన పవన్..!

రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతాం సినిమాకు రీమేక్ గా మరో సినిమాను లైన్లో పెట్టాడు పవన్ కళ్యాణ్. గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని మాత్రం పట్టించుకోవట్లేదు. రెండు భాగాలుగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్ట్ కి సంబందించిన క్లైమాక్స్ షూటింగ్ ని పెండింగ్ పెట్టారని వార్తలొచ్చాయి.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం 4రోజుల డేట్స్ కేటాయించారట. ఈ నాలుగురోజులు రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్లో ఒక పాటను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే పూర్తైన ఆ ఖరీదైన సెట్ కి పవన్ ఎప్పుడొస్తే అప్పుడు షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉందట సినిమా యూనిట్. ఇంటర్వెల్ కి ముందు వాచీ ఆ సాంగ్ షూటింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఎప్పుడూ లేనిది, పవన్ కళ్యాణ్ చకచకా షూటింగ్లో పాల్గొనటం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక్క సినిమాకు కూడా 40రోజులకు మించి డేట్స్ కేటాయించకపోవటం, ఎక్కువ శాతం సినిమాలు రీమేక్స్ అవ్వటం వల్ల సినిమా క్వాలిటీపై ప్రభావం పడుతుందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారని. ఈ పాటికి షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండాల్సిన వీరమల్లు సినిమాని నత్త నడకన సాగిస్తున్న పవన్ ఈ సారైనా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు