Agent: డిజాస్టర్ కి కారణం డైరెక్టరే – అఖిల్ కూడా చెప్పేసాడు..!

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు హీరో అఖిల్, ఇటు అక్కినేని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా తొలి ఆటతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండేళ్ల పాటు సిక్స్ ప్యాక్ బాడీ మెంటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఈ సినిమా డిజాస్టర్ కి తనదే బాధ్యత అంటూ నిర్మాత అనిల్ సుంకర ఇటీవలే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లటమే తాము చేసిన పొరపాటని ఒప్పుకున్నాడు అనిల్ సుంకర.

ఈ నేపథ్యంలో హీరో అఖిల్ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏజెంట్ సినిమా నిర్మాతకు, సన్నిహితులకు, మీడియాకు, తనపై నమ్మకం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసిన అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి పేరుని ప్రస్తావించకపోవడం చర్చకు దారి తీసింది. నిజానికి ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత అక్కినేని అభిమానులు మొదలుకొని, విమర్శకులు, ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరు దర్శకుడు సురేందర్ రెడ్డి వల్లనే ఇలా అయ్యిందంటూ అభిప్రాయపడ్డారు.

నిర్మాత అనిల్ సుంకర దర్శకుడి గురించి నెగిటివ్ గా చెప్పనప్పటికీ, ఇప్పుడు అఖిల్ రిలీజ్ చేసిన నోట్ లో సురేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించకపోవడం ఏజెంట్ డిజాస్టర్ కి అతనే కారణం అన్న వాదనకు బలం చేకూర్చుతోంది. అంతే కాకుండా, సినిమా షూటింగ్ సమయంలో అఖిల్ కి, సురేందర్ రెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలు కూడా నిజమేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఏజెంట్ వైఫల్యానికి కారణం డైరెక్టరే అంటూ అఖిల్ కూడా పరోక్షంగా చెప్పిన క్రమంలో సురేందర్ రెడ్డి నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు