Spy: అఖిల్ మిస్సైన పాయింట్ నిఖిల్ క్యాచ్ చేశాడు..!

కార్తికేయ 2సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పై’ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదల చేసింది సినిమా యూనిట్. ఉత్కంఠ రేపే యాక్షన్స్ సీక్వెన్స్ తో నిండిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ ఆధారంగా రూపొందిన ఈ కథ పాన్ ఇండియా వైడ్ హిట్ అందుకోవటానికి హెల్ప్ అవుతుందన్న అభిప్రాయం వెల్లడవుతుంది. స్పై థ్రిల్లర్ సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ అన్ని  సినిమాలో ఉన్నట్లు అనిపిస్తోంది.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, మకరంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. స్పై థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ఆసక్తి రేపే కథనం ఉన్న ఈ సినిమా హిట్ అవ్వటం ఖాయం అన్న ఫీల్ ఇస్తోంది టీజర్. కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్ స్పై సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లే అనిపిస్తుంది.

ఇటీవల అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వటానికి ప్రధాన కారణం కథ ఎంగేజింగ్ గా ఉండకపోవటమే అని తెలిసిందే. అదే జానర్లో వస్తున్న స్పై సినిమాలో అలాంటి పొరపాట్లు జరగలేదని అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. కార్తికేయ2 తర్వాత మరోసారి పాన్ ఇండియా అపీల్ ఉన్న కథతో వస్తున్న నిఖిల్ ఈ సినిమాతో హిట్ అందుకొని తన పాన్ ఇండియా జర్నీని కంటిన్యూ చేస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు